దుబాయ్: అండర్19 ఆసియాకప్(India 19 vs UAE 19)లో టీమిండియా రికార్డు క్రియేట్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 433 రన్స్ చేసింది. యూఏఈతో జరిగిన వన్డే మ్యాచ్‌లో.. భారత బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పరుగుల సునామీ సృష్టించాడు. 95 బంతుల్లో అతను 171 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. అండర్19 వన్డేల్లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. అండర్19 వన్డేల్లో మూడు సార్లు 400 ప్లస్ రన్స్ చేసిన జట్టుగా ఇండియా సరికొత్త రికార్డు నమోదు చేసింది. గతంలో 2004లో స్కాట్ల్యాండ్పై 3 వికెట్ల నష్టానికి 425 రన్స్ చేసింది. ఇక 2022లో ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 5 వికెట్ల నష్టానికి 405 రన్స్ చేసింది. అండర్19 క్రికెట్లో ఇండియా మూడు సార్లు 400 ప్లస్ స్కోరు సాధించడం అసాధారణ ఫీట్‌గా భావిస్తున్నారు. యూఏఈతో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆరన్ జార్జీ 69, విహాన్ మల్హోత్రా 69, వేదాంత్ త్రివేది 38, అభిజ్ఞాన్ కుండు 32, కనిష్క్ చౌహాన్ 28 రన్స్ చేశారు.
Innings Break!
A fantastic 1⃣7⃣1⃣ by Vaibhav Sooryavanshi and crucial middle order contributions propel India U19 to a mammoth 4⃣3⃣3⃣ 👌👌
Over to our bowlers 🙌
Scorecard ▶️ https://t.co/bLxjt3WDXc#MensU19AsiaCup2025 pic.twitter.com/9HtN6I2AtZ
— BCCI (@BCCI) December 12, 2025
14 ఏళ్ల సూర్యవంశీ దూకుడు ఇన్నింగ్స్ ఇండియాకు గట్టి పునాది వేసింది. ఆరంభం నుంచీ వైభవ్ దుమ్మురేపాడు. బౌండరీలతో హోరెత్తించాడు. సిక్సర్లు, ఫోర్లతో దుబాయ్ మైదానంలో చెలరేగిపోయాడు. వైభవ్ తన సూపరఫాస్ట్ ఇన్నింగ్స్‌లో 14 సిక్సర్లు, 9 ఫోర్లు బాదాడు. తృటిలో అతను డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కేవలం 95 బంతుల్లోనే సూర్యవంశీ 171 రన్స్ చేసి అందర్నీ స్టన్ చేశాడు. అండర్19 క్రికెట్లో అత్యధిక స్కోరు చేసిన రెండవ ఇండియన్ బ్యాటర్‌గా సూర్యవంశీ ఘనత దక్కించుకున్నాడు.
వైభవ్ ఈ ఇన్నింగ్స్‌తో కొన్ని రికార్డులు బద్దలు కొట్టాడు. అండర్19 ఆసియాకప్‌లో అత్యధిక సంఖ్యలో ఓ ఇన్నింగ్స్‌లో సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడతను. గతంలో 2017లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ దార్విష్ రసూలీ అత్యధికంగా 10 సిక్సర్లు బాదాడు. మరో ఆసియా రికార్డును కూడా బ్రేక్ చేశాడు సూర్యవంశీ. ఆసియాకప్‌లో తన పవర్ హిట్టింగ్తో ఆకట్టుకున్న వైభవ్.. అత్యధిక సిక్సర్ల సంఖ్యను కూడా తన పేరిట రాసుకున్నాడు. ఆసియాకప్ అండర్19 టోర్నీలో రసూలీ ఇప్పటి వరకు 22 సిక్సర్లు బాదాడు. ఆ సంఖ్యను దాటేసిన వైభవ్ ఆ టోర్నీలో ఇప్పటికే 26 సిక్సర్లు కొట్టేశాడు.