Vada Pav : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో స్ట్రీట్ ఫుడ్ గురించి ప్రస్తావన వస్తే లెజెండరీ వడ పావ్ ముందుగా అందరికీ గుర్తుకొస్తుంది. గత కొన్నేండ్లుగా ఈ హాట్ డిష్‌కు దేశ విదేశాల్లో ఆదరణ పెరిగింది. నూనెలో డీప్ ఫ్రై చేసిన వడ, ఆపై లేయర్లో పావ్ (మెత్తడి బ్రెడ్ బన్)తో ఈ డిష్‌ను అల్లం చట్నీ సహా ఇతర చట్నీలతో సర్వ్ చేస్తారు.
ఇక ఈ క్రేజీ రెసిపీ ఇటీవల ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రకటించిన ప్రపంచంలోనే బెస్ట్ శాండ్విచ్ల జాబితాలో వడ పావ్‌కు చోటు దక్కింది. ఈ జాబితాలో వడ పావ్ 19వ స్ధానంలో నిలిచింది. 1960, 70ల్లో దాదర్ రైల్వే స్టేషన్ వద్ద స్ట్రీట్ ఫుడ్ వెండార్‌గా పనిచేసిన అశోక్ వైద్య తొలుత ఈ ఐకానిక్ స్ట్రీట్ ఫుడ్‌ను ప్రవేశపెట్టారని చెబుతారు.
కార్మికుల ఆకలి తీర్చే పదార్దం సులభంగా తయారు చేయగలిగేది, అందుబాటు ధరలో లభించేలా ఉండేలా సులభంగా క్యారీ చేసేదిగా ఉండాలని అశోక్ వైద్య ఆలోచించారని టేస్ట్ అట్లాస్ రాసుకొచ్చింది. ఈ విధంగా రుచికరమైన వడ పావ్ ఆవిర్భవించింది. ఇక ఇవాళ ఈ స్నాక్‌ను స్ట్రీట్ స్టాల్స్ నుంచి హైఫై రెస్టారెంట్స్ వరకూ పలు ఈటరీల్లో ఎంతో మంది ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ముంబై కల్చర్‌లో ఓ భాగంలా మారింది. గ్లోబల్ బెస్ట్ శాండ్‌విచ్‌ల్లో ఫస్ట్ ర్యాంక్‌లో బహ్ మి నిలవగా టాంబిక్ డోనర్, షవర్మ టాప్ టూ, త్రీ స్ధానాలను దక్కించుకున్నాయి.
Read More :
Train | రైల్లో సీటు కోసం గొడవ.. వ్యక్తి కాలర్ పట్టుకొని దుర్బాషలాడిన తల్లీకూతుళ్లు.. VIDEO