బుధవారం 03 మార్చి 2021
National - Jan 22, 2021 , 14:36:44

దేశంలోని ప్ర‌తి మూల‌కు వ్యాక్సిన్లు అందుతున్నాయి : ప‌్ర‌ధాని

దేశంలోని ప్ర‌తి మూల‌కు వ్యాక్సిన్లు అందుతున్నాయి : ప‌్ర‌ధాని

వార‌ణాసి:  కోవిడ్ టీకా తీసుకున్న వారితో ఇవాళ ప్ర‌ధాని మోదీ మాట్లాడారు.  స్వంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన వార‌ణాసిలో కోవిడ్ టీకా తీసుకున్న ల‌బ్ధిదారుల‌తో ప్ర‌ధాని సంభాషించారు. వ‌ర్చువ‌ల్ విధానంలో ఆయ‌న వారితో మాట్లాడారు.  ప్ర‌పంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఇండియాలో జ‌రుగుతున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. స్వంత వ్యాక్సిన్ల‌ను ఉత్ప‌త్తి చేసే స‌త్తా భార‌త్‌కు ఉంద‌న్నారు. ఒక‌టి కాదు, రెండు మేడిన్ ఇండియా టీకాలు త‌యార‌వుతున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. దేశంలోని ప్ర‌తి మూల‌కు వ్యాక్సిన్లు అందుతున్నాయ‌న్నారు. వ్యాక్సిన్ల అంశంలో దేశం స్వ‌యం స‌మృద్ధిగా ఉంద‌ని ప్ర‌ధాని తెలిపారు. 

VIDEOS

logo