న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ( Vaccination ) శరవేగంగా కొనసాగుతున్నదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 65 కోట్లకుపైగా (65,00,99,080) వ్యాక్సిన్ డోసులను సమకూర్చామని, మార్గమధ్యలో ఉన్న మరో 1.20 కోట్ల (1,20,95,700) వ్యాక్సిన్ డోసులు త్వరలోనే రాష్ట్రాలకు చేరనున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
కాగా, ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చేరిన 65 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులలో వృథా అయిన వాటితో కలిపి సుమరు 61 కోట్ల వ్యాక్సిన్ డోసులు వినియోగించబడ్డాయని, మరో 4.36 కోట్ల డోసులు రాష్ట్రాల దగ్గర అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.