Dating | డేటింగ్ చేయడం నేరమా?.. టీనేజర్ల అరెస్టుపై సర్కారును ప్రశ్నించిన కోర్టు
మైనర్ బాలికలతో డేటింగ్ చేసే మైనర్ బాలురను అరెస్ట్ చేయడం న్యాయమేనా? మైనర్ బాలికల తల్లిదండ్రులు ఆ బాలురపై ఫిర్యాదు చేయాలా? ఇటువంటి కేసుల్లో అరెస్టులను నివారించగలమా? అని ఉత్తరాఖండ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
Dating | న్యూఢిల్లీ: మైనర్ బాలికలతో డేటింగ్ చేసే మైనర్ బాలురను అరెస్ట్ చేయడం న్యాయమేనా? మైనర్ బాలికల తల్లిదండ్రులు ఆ బాలురపై ఫిర్యాదు చేయాలా? ఇటువంటి కేసుల్లో అరెస్టులను నివారించగలమా? అని ఉత్తరాఖండ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. డేటింగ్ చేసే బాలురను అరెస్టు చేయడం కన్నా, వారికి సలహా ఇవ్వడానికి పిలవవచ్చునని వ్యాఖ్యానించింది. ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ విధంగా స్పందించింది. ఇటువంటి కేసుల్లో కేవలం బాలురను మాత్రమే దోషులుగా పరిగణిస్తూ, శిక్షిస్తున్నారని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తలను చదవండి..
పోక్సో కేసులో యెడియూరప్పకు కోర్టు సమన్లు
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యెడియూరప్పకు బెంగళూరు కోర్టు సమన్లు జారీ చేసింది. ఆయనపై పోక్సో చట్టం కింద నమోదైన కేసులో ఈ నెల 15న జరిగే విచారణకు హాజరుకావాలని ఆయనను ఆదేశించింది. బాధిత మైనర్ బాలిక (17), ఆమె తల్లి మౌనంగా ఉండటం కోసం వారికి యెడియూరప్ప, మరో ముగ్గురు నిందితులు సొమ్ము చెల్లించారని సీఐడీ ఆరోపించింది.
సవాలు విసిరి.. రాజీనామా చేసి
జైపూర్: రాజస్థాన్ బీజేపీ మంత్రి కిరోడిలాల్ మీనా తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాను బాధ్యత వహించే ఏడు నియోజకవర్గాల్లో ఏ ఒక్కదాంట్లో బీజేపీ ఓడినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. ఫలితాలు ఆయనకు వ్యతిరేకంగా వచ్చాయి. ఆయన సొంత నియోజకవర్గం దౌసా సహా నాలుగు స్థానాల్లో బీజేపీ ఓటమి పాలైంది. దీంతో తాను విసిరిన సవాల్ మేరకు పదవికి రాజీనామా చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

