Uttarakhand | ఉత్తరాఖండ్‌కు ఆరెంజ్ అలర్ట్.. కొండచరియలు విరిగిపడి బద్రినాథ్ రోడ్డు బ్లాక్
Uttarakhand : ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఈ మేరకు కేంద్ర వాతావరణ శాఖ ఉత్తరాఖండ్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. డెహ్రడూన్ సహా అనేక జిల్లాల్లో వర్షాలు అధికంగా పడుతున్నాయి.
Uttarakhand : ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఈ మేరకు కేంద్ర వాతావరణ శాఖ ఉత్తరాఖండ్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. డెహ్రడూన్ సహా అనేక జిల్లాల్లో వర్షాలు అధికంగా పడుతున్నాయి. రాబోయే 48 గంటలపాటు ఇక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించిన ఐఎండీ.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది.
వర్షాల వల్ల కొండ చరియలు విరిగిపడటంతో బద్రినాథ్ హైవేతోపాటు, కేదార్నాథ్ మార్గం కూడా నిలిచిపోయింది. చమోలి జిల్లాలోని కేదార్నాథ్ యాత్ర సాగే రుద్రప్రయాగ్ జిల్లాలో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోంది. యాత్ర సాగే మార్గంలో భారీగా రాళ్లు, వ్యర్థ పదార్థాలు పడిపోయాయి. దీంతో యాత్రకు తాత్కాలికంగా ఇబ్బంది కలుగుతోంది. భక్తులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. యాత్రామార్గంలోని అడ్డంకులను తొలగిస్తూ, రూట్ క్లియర్ చేస్తున్నారు. ఛార్‌ధామ్ యాత్రలో భాగంగా భక్తులు కేదార్నాథ్ యాత్ర చేపడుతారు. ఈ మార్గంలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చమోలి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. రాబోయే రోజుల్లో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.
ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. విపత్తు నిర్వహణ విషయంలో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వేగంగా స్పందించాలని, అన్ని విభాగాలు సహకారం, సమన్వయంతో పని చేయాలని సూచించారు. పర్వత ప్రాంతాల్లో అవసరమైతే ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

