కాంగ్రెస్ పదవులకు రావత్ రాజీనామా
ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. తన పీఏ చందన్ సింగ్ జీనా నివాసాల్లో శుక్రవారం ఈడీ దాడులు జరగ్గా.. శనివారం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
- ఈడీ దాడుల నేపథ్యంలో మాజీ సీఎం నిర్ణయం
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. తన పీఏ చందన్ సింగ్ జీనా నివాసాల్లో శుక్రవారం ఈడీ దాడులు జరగ్గా.. శనివారం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 2016లో హరీశ్ రావత్ సీఎంగా ఉన్నప్పుడు చందన్ సింగ్ ఆయనకు ఓఎస్డీగా పనిచేశారు. ఆ ఏడాదిలో నియామక పరీక్షల్లో జరిగిన అక్రమాల్లో మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా చందన్ సింగ్ ఇల్లుతో పాటు పలు చోట్ల ఈడీ సోదాలు జరిగాయి.
ఈ దాడుల్లో రూ.32 లక్షల లెక్కలు చూపని నగదు, 200 గ్రాముల బంగారం, లగ్జరీ వాచ్‌లు అధికారులు గుర్తించారు. చందన్ సింగ్ కుటుంబీకుల బ్యాంకు ఖాతాల్లో రూ.50 లక్షల దాకా నగదును సీజ్ చేశారు. ఈ దాడుల నేపథ్యంలో హరీశ్ రావత్ మాట్లాడుతూ.. తన వల్ల కాంగ్రెస్‌కు ఇబ్బంది రావొద్దనే పదవులకు రాజీనామా చేశానన్నారు. నియామక పరీక్షల్లో ఆరోపణలు నిజమని తేలితే తనకు కూడా సిగ్గుచేటేనని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Rayapol SI | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు.. రాయపోల్ ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
Abhijeet Dipke: విమానంలోనే దీప్కే అరెస్టు..
Accident | వలస కూలీల ట్రాక్టర్‌ను ఢీకొన్న టిప్పర్.. ఒకరు మృతి, 32 మందికి గాయాలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

