హోచిమిన్ సిటీ (వియత్నాం): భారత యువ షట్లర్ ఇషారాణి వియత్నాం ఓపెన్ సూపర్100 టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో మూడో సీడ్ ఇషారాణి 21-10, 21-18తో తోటి షట్లర్ ఆరో సీడ్ రక్షిత శ్రీని చిత్తు చేసింది. మరో భారత షట్లర్, టాప్ సీడ్ తన్వి శర్మ 19-21, 20-22తో అన్‌సీడెడ్ సరున్రాక్ (థాయ్‌లాండ్)చేతిలో అనూహ్యంగా ఓడింది. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో భారత వెటరన్ స్టార్ హెచ్ఎస్ ప్రణయ్ 13-21, 8-21తో టాప్ సీడ్ జియా హెంగ్ తెహ్ (సింగపూర్) చేతిలో చిత్తయ్యాడు.