హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బార్ కౌన్సిల్లో కీలక పదవుల ఎన్నికకు సంబంధించి చెల్లుబాటైన నామినేషన్ల జాబితా విడుదలైంది. చైర్మన్, వైస్‌చైర్మన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) సభ్యుడి పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో పరిశీలన అనంతరం 11మంది పోటీలో ఉన్నట్టు బార్ కౌన్సిల్ ప్రకటించింది. చైర్మన్ ప దవికి పొన్నం అశోక్‌గౌడ్, టీ హనుమంత్‌రెడ్డి, సముల రామ్‌రెడ్డి, వైస్‌చైర్మన్ పదవికి రామారావు గోకుల్, వెంకట్ యాదవ్ చలకాని, జాకీర్‌హుస్సేన్ జావిద్ పోటీలో ఉన్నట్టు వెల్లడించింది.
తెలంగాణ నుంచి బీసీఐ సభ్యు డి పదవి కోసం అనంతసేన్‌రెడ్డి ఆకుల, జీ అనిల్ కిరణ్‌కుమార్, డీ జగదీశ్వర్‌రావు, జీ కిరణ్ కుమార్, సుజాత పాశం పోటీపడుతున్నట్టు తెలిపింది. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుల సాధారణ ఎన్నికలు జనవరి 30న జరిగాయి. మార్చి 24న ఫలితాలు ప్రకటించగా.. 23మంది సభ్యులు ఎన్నికయ్యారు. మరో ఇద్దరు సభ్యులను సహనామినేషన్ ద్వారా ఎంపిక చేయడంతో మొత్తం సభ్యుల సంఖ్య 25కి చేరింది. వీరి నుంచి చైర్మన్, వైస్‌చైర్మన్, బీసీఐ సభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉన్నది.