Operation Bhediya | బహ్రెయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని భరూచ్‌లో పలు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న తోడేళ్లను పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ భేడియా చేపట్టింది. తోడేళ్ల దాడిలో ఇటీవల ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగు తోడేళ్లను పట్టుకున్నది.
బారాబంకీ డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్, ‘ఆపరేషన్ భేడియా’ ఇన్‌ఛార్జి ఆకాశ్‌దీప్ బధవాన్ మాట్లాడుతూ, సిసయ్య చూడామణి గ్రామం సమీపంలో తాము ఏర్పాటు చేసిన వలల్లో ఒక మగ తోడేలు పడిందన్నారు. అయితే ఈ ప్రాంతంలో ఎన్ని తోడేళ్లు తిరుగుతున్నాయో స్పష్టంగా తెలియడం లేదని అధికారులు చెప్తున్నారు.