Schools closed: ఉత్తరాది రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తున్నది. ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో చలి చంపేస్తున్నది. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో అయితే జనం ఇంటి నుంచి కాలు పెట్టాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, లక్నో జిల్లాల్లో చలి ప్రభావం మరింత తీవ్రంగా ఉన్నది.
తీవ్రమైన చలి, పొగమంచు కారణంగా వారణాసిలో ఇప్పటికే జనవరి 6 వరకు స్కూళ్లకు సెలవు ప్రకటించగా.. తాజాగా లక్నో జిల్లాలో కూడా స్కూళ్లను మూసేశారు. ఒకటి నుంచి 8వ తరగతి చదివే పిల్లలకు ఈ నెల 6 వరకు సెలవులు ప్రకటించారు. అయితే 9 నుంచి 12 వరకు చదువుతున్న పిల్లలకు సెలవులు ఇవ్వకపోయినా టైమింగ్స్‌లో మార్పులు చేశారు. వారికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తరగతులు బోధించనున్నారు.