Noida Protests | వేతనాలు పెంచేందుకు యూపీ ప్రభుత్వ అంగీకారం.. కనీస వేతనం నెలకు రూ.13,690
Noida Protests : వేతనాలు పెంపు, కనీస హక్కుల కోసం నోయిడా కార్మిక వాడలోని ఫేజ్2లో కార్మికులు చేపట్టిన నిరసన సోమవారం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్మికుల డిమాండ్లపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది.
Noida Protests : వేతనాలు పెంపు, కనీస హక్కుల కోసం నోయిడా కార్మిక వాడలోని ఫేజ్2లో కార్మికులు చేపట్టిన నిరసన సోమవారం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్మికుల డిమాండ్లపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. కార్మికులకు కనీస సగటు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అన్ని స్థాయిల్లోని కార్మికులు ఇది వర్తిస్తుందని తెలిపింది.
నిరసనలు జరిగిన గౌతమ్ బుద్ధనగర్ జిల్లా మేజిస్ట్రేట్ మేధా రూపం ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ సూచనలకు అనుగుణంగా వేతనాలు పెంచుతూ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నట్లు మేధా రూపం తెలిపారు. వేతనాల పెంపు నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందన్నారు. ఈ కమిటీ నిర్ణయం ప్రకారం.. గౌతమ్ బుద్ధనగర్, ఘజియాబాద్ పరిధిలోని అన్ స్కిల్డ్ వర్కర్స్కు నెలకు కనీస వేతనం రూ.13,690గా నిర్ణయించారు. అంతకుముందు ఈ వేతనం రూ.11,313గా ఉండేది. సెమీ స్కిల్డ్ వర్కర్స్కు నెలకు రూ.15,059, స్కిల్డ్ వర్కర్స్కు రూ.16,868 అందిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్‌స్కిల్డ్ కార్మికులకు నెలకు రూ.13,006, సెమీ స్కిల్డ్ వర్కర్స్కు రూ.14,306, స్కిల్డ్ వర్కర్స్కు రూ.16,025 వేతనం అందిస్తారు.
యూపీలోని మిగతా జిల్లాల్లో అన్‌స్కిల్డ్ కార్మికులకు నెలకు రూ.12,356, సెమీ స్కిల్డ్ వర్కర్స్కు రూ.13,591, స్కిల్డ్ వర్కర్స్కు రూ.15,224 వేతనం అందిస్తారు. ఎంప్లాయర్స్ అసోసియేషన్స్, లేబర్స్ యూనియన్లను సంప్రదించిని అనంతరం ఈ మార్పులపై నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం వేతనాల పెంపుపై నిర్ణయం ప్రకటించినప్పటికీ మంగళవారం కూడా చాలాచోట్ల కార్మికులు నిరసనలు కొనసాగిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

