లక్నో: ఉత్తరప్రదేశ్లో దళితులు, వెనుకబడిన వర్గాలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఉచితంగా చికెన్ ఇవ్వలేదని ఓ దళితుడిని నడిరోడ్డుపై కొంతమంది చెప్పులతో కొట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. లలిత్పూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితుడు సుజాన్ అహిర్వార్ ద్విచక్ర వాహనంపై వివిధ గ్రామాలు తిరుగుతూ చికెన్ అమ్ముతుంటాడు. మద్యం మత్తులో ఉన్న కొంతమంది ఇటీవల అహిర్వార్ను రోడ్డుపై అడ్డుకొని, ఫ్రీగా చికెన్ ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు. డబ్బులు ఇవ్వాల్సిందేనని బాధితుడు చెప్పటంతో, తీవ్ర ఆగ్రహానికి లోనైన నిందితులు చెప్పులతో బాధితుడిపై దాడికి తెగబడ్డారు.