లక్నో, మార్చి 3: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో అసాధారణ పరిణామం చోటుచేసుకుంది. కొద్దిసేపు న్యాయస్థానంగా మారిన అసెంబ్లీ 20 ఏండ్ల నాటి ఘటనపై ఆరుగురు పోలీసులకు శిక్ష విధించి, వెంటనే అమలు చేసింది. 2004 సెప్టెంబరు 15న బీజేపీకి చెందిన అప్పటి ఎమ్మెల్యే సలీల్ వైష్ణాయ్ విద్యుత్తు కోతలపై ప్రజలతో కలిసి కాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్‌కు వినతిపత్రం ఇవ్వాలనుకున్నారు.
ఆ సమయంలో ఆరుగురు పోలీసులు ఆయన పట్ల అవమానకరంగా వ్యవహరించారు. నాటి ఘటనకు బాధ్యులైన ఆరుగురు పోలీసులను అసెంబ్లీకి పిలిపించి ఒక రోజు జైలు శిక్ష విధిస్తూ స్పీకర్ సతీశ్ మహన తీర్పు వెలువరించారు.