న్యూయార్క్: భారతీయులకు అమెరికా గుడ్‌న్యూస్ చెప్పింది. సుమారు 2.5 లక్షల అదనపు వీసా అపాయింట్మెంట్ల(Visa Appointments)ను రిలీజ్ చేసింది. భారత్‌లోని యూఎస్ మిషన్‌లో భాగంగా ఈ ఆఫర్ ఇచ్చారు. అమెరికా నిర్ణయాన్ని భారత-అమెరికా కమీషనర్ స్వాగతించారు. టూరిస్టులు, నైపుణ్య కార్మికులు, విద్యార్థులకు అదనపు స్లాట్స్‌ను వదిలినట్లు తెలుస్తోంది. వైట్‌హౌజ్‌కు సమర్పించిన ప్రతిపాదనల వల్లే ప్రభుత్వం కోటా రిలీజ్ చేసినట్లు ఆసియా-అమెరికన్ల అడ్వైజరీ కమీషన్ ప్రెసిడెంట్ అజయ్ భూటోరియా తెలిపారు.