Shashi Tharoor : ఇటీవల ఒమన్ తీరం (Oman Coast) లో అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారత నావికులు (Indian Sailers) మృతిచెందిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశిథరూర్ (Sashitharoor) స్పందించారు. ఒమన్ దాడిలో భారతీయ నావికుల మృతిపై ‘మిత్రదేశం’ అమెరికా సంతాపం తెలుపకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ దాడిలో భారతీయ సిబ్బంది మరణించిన ఘటనపై అమెరికా స్పందించిన తీరు సరైంది కాదని విమర్శించారు.
శశిథరూర్ మాట్లాడుతూ.. ‘ఈ అధికారిక అమెరికా ప్రకటనను చదవడం చాలా షాకింగ్‌గా ఉంది. అమాయక భారతీయుల ప్రాణాలు కోల్పోవడంపై ఇందులో ఎలాంటి విచారం లేదా సంతాపం లేదు. ఒక ‘మిత్రదేశం’ వ్యూహాత్మక భాగస్వామి ఇంత ఘోరమైన ఉదాసీనతను ఎలా ప్రదర్శిస్తుంది..? అని ఎక్స్ వేదికగా వాషింగ్టన్‌ని ప్రశ్నించారు. ఒకవేళ ఆ నౌక నిబంధనలను పాటించకుండా ఉన్నా.. ఆ వాణిజ్య నౌకపై దాడులు కాకుండా ఇతర మార్గాల ద్వారా ఎందుకు ఆపలేకపోయారని అడిగారు.
సాధారణ సిబ్బంది ప్రాణాలను బలిగొనేలా క్షిపణులను ప్రయోగించకుండా ఒక నౌక యొక్క ప్రొపల్షన్ లేదా స్టీరింగ్‌ను మాత్రమే నిలిపివేయడం సాధ్యం కాదా..? అని ఆయన ప్రశ్నించారు.