US-Pak | దాయాది దేశం పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. అత్యాధునిక మిస్సైల్స్‌ను సరఫరా చేసేందుకు అమెరికా నిరాకరించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్‌కు కొన్ని ఆయుధాలు, సామగ్రి సరఫరా చేస్తామని.. అయితే, కొత్త ఆయుధాలను మాత్రం సరఫరా చేయబోమని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. పాక్‌కు ఆధునిక అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను (AMRAAM) అందిస్తుందని పలు నివేదికలు తెలిపాయి. తాజాగా ఈ వార్తలను యూఎస్ ఖండించింది. ఈ మేరకు అమెరికా రాయబార కార్యాలయంలో ఓ ప్రకటన విడుదల చేసింది.
సెప్టెంబర్ 30న యుద్ధ విభాగం పాక్‌తో సహా అనేక దేశాలకు ఆయుధాలు, సామగ్రి అమ్ముతున్నట్లుగా ప్రకటించింది. పలు మీడియా నివేదికలు మాత్రం అమ్రామ్ (AMRAAM) మిస్సైల్స్‌ను పాకిస్తాన్‌కు సరఫరా చేస్తారని పేర్కొన్నాయి. అయితే, పాక్ సైనిక ప్రస్తుత సామర్థ్యాలను పెంచే ప్రణాళిక ఏం లేదని తాజాగా యూఎస్ తేల్చి చెప్పింది. పాక్‌కు అమ్రామ్ మిస్సైల్స్‌ను అమ్మకాన్ని యూఎస్ యుద్ధ విభాగం ఆమోదించిందని అనేక పాకిస్తాన్ మీడియా ఛానెల్స్‌ను సైతం పేర్కొనడం గమనార్హం. టక్సన్, అరిజోనాలో ఉన్న రేథియాన్ కంపెనీ పాకిస్తాన్‌కు అధునాతన క్షిపణులను సరఫరా చేస్తుందని ఓ నివేదిక పేర్కొంది. ఈ నివేదికలను పాకిస్తాన్ వైమానిక దళం సైనిక సామర్థ్యాలను పెంచే చర్యగా భావించగా.. తాజాగా అమెరికా అలాంటి ప్రణాళికలు లేవని స్పష్టం చేసింది. పాకిస్తాన్ F-16 ఫైటర్ జెట్ల కోసం 2007లో అమెరికా నుంచి 700 అమ్రామ్ మిస్సైల్‌ను తీసుకుంది.
ఆ సమయంలో ఇది ఎయిర్-టు-ఎయిర్ అమ్రామ్ మిస్సైల్స్ కోసం అతిపెద్ద అంతర్జాతీయ ఆర్డర్. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సెప్టెంబర్‌లో వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసినప్పుడు కొత్త ఒప్పందంపై ప్రచారం జరిగింది. యూఎస్ ఎయిర్ ఫోర్స్ ప్రకారం.. ఈ ఈ మిస్సైల్ ప్రత్యేక లక్షణం దాని టార్గెట్-లాక్ సామర్థ్యం దీని సొంతం. ఇది సూపర్సోనిక్ వేగంతో ప్రయాణించి, కంటి రెప్పపాటులో తన లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది. దీనిని సెప్టెంబర్ 1991లో యూఎస్ సైన్యంలో చేర్చారు. హ్యూస్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీ, రేథియాన్ సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. ఈ క్షిపణి 143.9 అంగుళాలు పొడవు, 150.75 కిలోల బరువు ఉంటుంది.