వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని ఫెడరల్ ప్రభుత్వం షట్‌డౌన్‌ను ముగించే ఒప్పందం చేసుకోకపోతే.. అక్కడి జనం మరింతగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతున్నాయి.
శుక్రవారం నుంచి 40 ప్రధాన విమానాశ్రయాల్లో 10 శాతం ఫ్లైట్స్‌ను రద్దు చేయబోతున్నట్టు యూఎస్ రవాణా కార్యదర్శి సీన్ డఫ్ఫీ తాజాగా వెల్లడించారు. అమెరికాలో షట్‌డౌన్ బుధవారం నాటికి 36వ రోజుకు చేరుకుంది. ఇది ఆ దేశ చరిత్రలో సుదీర్ఘమైన షట్డౌన్గా నిలిచింది.