న్యూఢిల్లీ, జూలై 13: హొర్ముజ్ జలసంధిలోని నైరుతి తీరంలో ఉన్న బందర్ అబ్బాస్ నౌకా స్థావరం వద్ద గల ఒక జలాంతర్గామి, నౌకల నిర్వహణ కేంద్రాన్ని సముద్ర డ్రోన్లు ధ్వంసం చేశాయని అమెరికా సైనిక కేంద్ర కమాండ్ సోమవారం ప్రకటించింది. సెంట్రల్ కమాండ్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఒక వీడియోను పంచుకుంటూ మూడు కార్సెయిర్ మానవరహిత ఉపరితల నౌకలను ఉపయోగించి ఈ దాడులు చేసినట్లు తెలిపింది.
యుద్ధ కార్యకలాపాలలో అమెరికా దళాలు సముద్ర డ్రోన్లను ఉపయోగించడం ఇదే మొదటిసారి అని పేర్కొంది. ఆదివారం రాత్రి జరిపిన ఈ దాడులతో వాణిజ్య నౌకలపై దాడులుజరిపే సామర్థ్యం ఇరాన్‌కు క్షీణించిందని సైనిక కమాండ్ పేర్కొంది.