న్యూఢిల్లీ: ఏటా సివిల్ సర్వీసుల్లోకి అభ్యర్థులను ఎంపిక చేసే యూపీఎస్సీ శుక్రవారం మరో 120 మంది అభ్యర్థులను సిఫార్సు చేసింది. రిజర్వ్ లిస్టులో ఉన్న వీరి పేర్లను విడుదల చేసింది. 2023లో నిర్వహించిన సివిల్ సర్వీస్ పరీక్షల తుది ఫలితాలను యూపీఎస్సీ ఈ ఏడాది ఏప్రిల్లో ప్రకటించింది.
మొత్తం 1143 ఖాళీలకు 1,016 మందిని వివిధ సర్వీసులకు ఎంపిక చేశారు. అనంతరం డీఓపీటీ విజ్ఞప్తి మేరకు రిజర్వ్ లిస్టులో ఉన్న 120 మంది పేర్లను కూడా కమిషన్ ప్రకటించింది.