Civils | న్యూఢిల్లీ, జనవరి 22: సివిల్ సర్వీసెస్ పరీక్ష(సీఎస్ఈ) 2025కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్ష కోసం రిజిస్ట్రేషన్లను సైతం ప్రారంభించింది. దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 11 వరకు అవకాశం ఇచ్చింది.
మే 25న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నది. రెండు పేపర్లతో, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది సివిల్ సర్వీసుల్లో 979 పోస్టులను యూపీఎస్సీ భర్తీ చేయనున్నది. కాగా, ప్రతియేటా ఫిబ్రవరిలో సివిల్స్ పరీక్షకు యూపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేది. ఈ ఏడాది జనవరిలోనే నోటిఫికేషన్ విడుదల చేసి, ప్రక్రియను ప్రారంభించింది.