న్యూఢిల్లీ: ఈ నెల 8 నుంచి యూపీఐ లావాదేవీలను బయోమెట్రిక్ పద్ధతిలోనూ చేసే అవకాశం అందుబాటులోకి రానుంది. ఇందులో వాడకందారులు పేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) లేదా వేలిముద్రల స్కాన్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఈ పద్ధతిలో పిన్ అవసరం ఉండదు. ఇందుకోసం యూ జర్లు తమ ఆధార్ ప్రొఫైల్తోఅనుసంధానమైన బయోమెట్రిక్‌ను చెల్లింపుల కోసం ఉపయోగించాల్సి ఉం టుంది. యూపీఐ చెల్లింపుల భద్రతను పెంచడానికి, క్రమబద్ధీకరించడానికి ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో యూజర్లు ముఖ గుర్తింపు లేదా వేలిముద్రల ద్వారా లావాదేవీలు చేసే అవకాశాన్ని పిన్ ఉపయోగించే పద్ధతికి ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసుకోవచ్చు.