న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలకు బుధవారం అంతరాయం ఏర్పడింది. దీంతో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం తదితర యూపీఐ యాప్‌ల యూజర్లు ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్, యాప్ మాల్ఫంక్షన్పై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది. నిధుల బదిలీ విఫలమైనట్లు 64 శాతం మంది, చెల్లింపు ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు 28 శాతం మంది, యాప్ సంబంధిత లోపాల గురించి 8 శాతం మంది ఫిర్యాదులు చేశారు.