1నుంచి వచ్చే మార్పులివే.. ఉచితంగా ఆధార్‌లో జీమెయిల్ మార్పు
దేశంలో వచ్చే నెల 1 నుంచి పలు కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. అవేంటో చూద్దాం..
- పెరగనున్న పాస్‌పోర్ట్ ఫీజులు
- రైల్వేశాఖ ఫైన్లు భారీగా పెంపు
న్యూఢిల్లీ : దేశంలో వచ్చే నెల 1 నుంచి పలు కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. అవేంటో చూద్దాం..
ఆధార్‌లో జీమెయిల్ మార్పు..
జూలై 1 నుంచి డిసెంబర్ 31 దాకా ఆధార్‌కార్డులో ఉచితంగా జీమెయిల్ అడ్రస్ మార్చుకోవచ్చు. ఇంతకుముందు జీమెయిల్ మార్పుకోసం రూ.75 చెల్లించేవారు.
పెరిగిన పాస్‌పోర్ట్ ఫీజులు..
పాస్‌పోర్ట్ ఫీజులు జూలై 1 నుంచి కేంద్రం పెంచినది. గతంలో రూ.1,500 ఉండగా ఇప్పుడు రూ.2,500కు పెరిగింది. అలాగే తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజును రూ.3,500 నుంచి రూ.5వేలకు పెంచారు.
రైల్వే ఫైన్ల పెంపు..
టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణిస్తే విధించే ఫైన్‌ను డబుల్ చేసింది రైల్వేశాఖ. ఇంతకుముందు ఎక్కిన స్టేషన్ నుంచి దిగిన స్టేషన్ వరకు అయ్యే టికెట్ చార్జీల మీద రూ.250 ఫైన్ విధిస్తే.. ఇక నుంచి టికెట్ చార్జీలతోపాటు రూ.500 ఫైన్ విధించనున్నారు. అలాగే మహిళల కోచ్‌లో పురుషులు ప్రయాణిస్తే ఫైన్‌ను రూ.2500కు, అనుమతి లేకుండాట్రైన్లలో వస్తువులు, ఆహార పదార్థాలు అమ్మితే విధించే ఫైన్‌ను రూ.2వేలకు పెంచారు.
పెరగనున్న కార్ల ధరలు..
టాటా ప్యాసింజర్ కార్ల మీద 1.5 శాతం, టాటా కమర్షియల్ కార్ల మీద 2.5 శాతం ధరలు పెరగనున్నాయి. ఎంజీ మోటార్స్ 3 శాతం, కియా మోటర్స్, బీఎండబ్ల్యూ కార్ల మీద 2 శాతం ధరలు పెరగబోతున్నాయి.
క్రెడిట్ కార్డుల్లో..
ఫోన్‌పే ఎస్బీఐ కార్డులో రివార్డు పాయింట్లను ఎస్బీఐ సవరించింది.
పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేత
పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై జూన్‌లో విధించిన ఆంక్షలను జూలై 1 నుంచి ఎత్తివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా జూన్‌లో అమ్మకాలపై ఆంక్షలు విధించగా.. ఇప్పుడు యుద్ధం ముగుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

