మంగళవారం 31 మార్చి 2020
National - Mar 02, 2020 , 15:03:18

కొత్త బట్టలు కొనివ్వలేదని భర్తపై కోపం.. కుమార్తె హత్య

కొత్త బట్టలు కొనివ్వలేదని భర్తపై కోపం.. కుమార్తె హత్య

లక్నో : త్వరలో రాబోయే హోలీ పండుగ.. ఓ ఇంట విషాదాన్ని నింపింది. హోలీ పండుగకు కొత్త బట్టలు కొనివ్వాలని భర్తను భార్య అడిగింది. అందుకు భర్త ఒప్పుకోకపోవడంతో.. ఆయన మీదున్న కోపంతో అభం శుభం తెలియని బిడ్డను హత్య చేసింది తల్లి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ అలీఘర్‌ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. రాహుల్‌, పింకి శర్మ(25)కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు, ఏడాది పాప ఉంది. అయితే త్వరలో వచ్చే హోలీకి కొత్త బట్టలు కొనివ్వాలని రాహుల్‌ను, పింకి అడిగింది. కొత్త బట్టలు కొనివ్వలేనని భార్యతో రాహుల్‌ చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భర్త మీదున్న కోపంతో తన పసిపాపను కొట్టి చంపింది. దీంతో రాహుల్‌ తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన బిడ్డను ఉద్దేశపూర్వకంగా చంపలేదని పింకి పోలీసుల ఎదుట వాపోయింది.


logo
>>>>>>