Budget 2024 | బడ్జెట్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంటు కష్టాలు లేని దేశ నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశంలోని కోటి ఇండ్లపై రూఫ్ టాప్ సిస్టమ్‌ను బిగించనున్నట్లు తెలిపారు. దాంతో ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఆయా కుటుంబాలు పొందగలుగుతాయన్నారు. దీంతో ప్రతి కుటుంబానికి ఏటా 15వేల నుంచి 18వేల వరకు ఆదా అవుతుందని చెప్పారు. వినియోగించుకున్న విద్యుత్‌ను పంపిణీ సంస్థలకు విక్రయించుకోవచ్చని చెప్పారు.
అయోధ్య రామ మందిరం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ పథకానికి సంబంధించిన పనులు త్వరలోనే వేగవంతం చేస్తామని ప్రకటించారు.