Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన నలుగురు పిల్లల్ని అతి కిరాతకంగా గొంతుకోసి చంపేశాడు (Father Kills Four Children). ఆపై అతడు ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. షాజహాన్‌పుర్ (Shahjahanpur) ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మన్పుర్ చచారి గ్రామానికి చెందిన రాజీవ్ కుమార్ (36)కు ముగ్గురు ఆడపిల్లలు స్మృతి (13), కిర్తి (9), ప్రగతి (7), కుమారుడు రిషభ్ (5) ఉన్నారు. బుధవారం రాత్రి వారు నిద్రిస్తున్న సమయంలో పదునైన కత్తితో నలుగురి పిల్లల గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం అతను ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం రాజీవ్ తండ్రి పృథ్వీ రాజ్ ఇంటి తలుపులు కొట్టగా తెరవలేదు. దీంతో అనుమానం వచ్చి అతడు ఇంటిపైకప్పు పైకెక్కి మెట్ల మార్గం ద్వారా ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ నలుగురు పిల్లలు, కుమారుడు మృతి చెంది కనిపించారు. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో రాజీవ్ భార్య ఇంట్లో లేదని పోలీసులు పేర్కొన్నారు. వీరి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
Infosys | మైసూర్ క్యాంపస్ నుంచి మరికొంతమంది ట్రైనీల తొలగింపు.. వారికి ఓ ఆఫర్ ఇచ్చిన సంస్థ
America | యూఎస్‌లో అంతర్జాతీయ విద్యార్థినికి బేడీలు వేసి తీసుకెళ్లిన అధికారులు.. వీడియో వైరల్
Donald Trump | ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. విదేశీ కార్లపై 25 శాతం సుంకం