కొందరికి సూది అంటే భయం. తీవ్ర జ్వరమొచ్చినా సూది మందు వేసుకునేందుకు భయపడిపోతుంటారు. మొన్నటివరకూ కరోనా టీకాలు వేసుకొమ్మంటే చాలామంది భయపడి పారిపోయారు. కొందరు చెట్టెక్కారు. రక్తపరీక్ష చేసేందుకు సిబ్బంది దగ్గరకు రాగా, ఓ యూపీ పోలీస్ అధికారి చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియో ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లోని పోలీసు శిక్షణా శిబిరంలోనిది. వైద్య పరీక్షల కోసం పోలీసు రక్త నమూనా ఇవ్వాల్సి వచ్చింది. ఒక మెడికల్ అసిస్టెంట్ సిరంజీ పట్టుకొని కుర్చీలో కూర్చున్న పోలీసు దగ్గరకు రాగా, అతడు చేతులు జోడించి ఏడవడం ప్రారంభించాడు. మరొక పోలీసు అతడి చేతిని గట్టిగా పట్టుకోవాల్సి వచ్చింది. అయినా అతడు గట్టిగా ఏడుస్తూ ప్రతిఘటించడంతో ఇద్దరు పట్టుకున్నారు. అతికష్టంమీద మెడికల్ సిబ్బంది అతడినుంచి రక్తం శాంపిల్ తీసుకున్నారు. ఈ ఫన్నీ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లకు నవ్వు తెప్పిస్తున్నది.