న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: హోటళ్లు, రెస్టారెంట్లలో కఠిన శుభ్రత ప్రమాణాలను అమలు చేయడంలో భాగంగా చెఫ్‌లు, వెయిటర్లు తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. అలాగే సీసీటీవీ కెమెరాలు కలిగి ఉండటం తప్పనిసరి అని చెప్పింది.
రాష్ట్రంలో ఉమ్మి, మూత్రంతో ఆహార కల్తీ జరిగిన ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. మానవ వ్యర్థాలు లేదా అపరిశుభ్ర పదార్థాలతో ఆహార కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.