Tragedy : విధి చాలా విచిత్రమైనది..! ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు..! మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో అస్సలే అంచనా వేయలేం..! తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఘోరక్పూర్లో జరిగిన ఓ విషాద ఘటన.. మరణం మన చేతిలో లేదని రుజువు చేసింది. ఘోరక్పూర్లోని సోన్బర్సా మార్కెట్ ఏరియాలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. స్థానిక నివాసి అయిన ఓ వ్యక్తి తన కుమార్తె, మేనకోడలుతో కలిసి బైకుపై బయటికి వచ్చాడు. వారు సోన్బర్సా మార్కెట్ ఏరియాలోని డంపింగ్ యార్డు దగ్గరికి చేరుకోగానే.. వారి పైనున్న 11 కేవీ విద్యుత్ వైర్లపై కోతి దూకింది. దాంతో ఓ వైర్ తెగి బైక్పై పడింది. దాంతో ముగ్గురూ విద్యుత్ అఘాతానికి గురయ్యారు. అందరూ చూస్తుండగానే క్షణాల్లో ముగ్గురూ అగ్నికి ఆహుతయ్యారు.
వారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కోతి దూకడంవల్లే విద్యుత్ వైర్ తెగిపడిందని, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించామని విద్యుత్ అధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
गोरखपुर एम्स थाना क्षेत्र के विशुनपुर खुर्द टोला धनहा निवासी शिवराज निषाद (24 वर्ष) अपने 9 वर्षीया भतीजी व दो वर्षीया पुत्री को बाइक पर बैठाकर सोनबरसा बाजार से घर जा रहा थे।पुलिया के पास एचटी लाइन का तार टूट गया।बाइक सवार तीनो उसके चपेट में आ गए और जलकर तीनो की मौत हो गई है।
1/2 pic.twitter.com/tGgYK1DAZv— RAJ PATHAK (JOURNALIST) (@Rajpathak4up) December 29, 2024