లక్నో: అభివృద్ధి, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై మంత్రిని నిలదీసిన ఓ జర్నలిస్టును జైలుకు పంపించారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. సంభాల్ జిల్లాలోని బుధ్నగర్ ఖండ్వాలో మంత్రి గులాబ్ దేవీ మార్చి 11న పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక జర్నలిస్టు సంజయ్ రానా.. మంత్రిని అభివృద్ధిపై ప్రశ్నించారు. దీంతో అక్కడి నుంచి మంత్రి జారుకున్నారు. ఆ తర్వాత బీజేవైఎం నేత ఒకరు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు జర్నలిస్టు సంజయ్ రానాను అరెస్టు చేశారు.