లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ కేవలం ఒకే ఒక్క సీటును కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ పార్టీ నేత మాయావతి మాట్లాడారు. బీఎస్పీ అంచనాలకు విరుద్ధంగా యూపీ ఎన్నికల ఫలితాలు ఉన్నట్లు ఆమె అన్నారు. ఈ ఫలితాలపై నిరాశచెందరాదన్నారు. ఈ ఫలితాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలని, ఆత్మావలోకనం చేసుకోవాలని, పార్టీ వ్యవహారాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆమె తెలిపారు. మళ్లీ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నారు. 2017కు ముందు యూపీలో బీజేపీ పాత్ర పెద్దగా లేదని, యూపీ ఎన్నికల ఫలితాలతో నిరంతర కృషి కొనసాగించాలన్నారు.