Viral Video | యూపీలోని పోలీసులకు వింత కేసు వచ్చింది. తన ఇంట్లో పావు కిలో ఆలుగడ్డలు మాయమయ్యాయని ఓ మందుబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలే వంట కోసం వాటిని ఉడుకబెట్టి.. పొట్టు తీసి పెట్టానని.. కానీ మందు తాగి వచ్చేసరికి ఎవరో ఎత్తుకెళ్లారని పోలీసులకు చెప్పాడు. వెంటనే దొంగను పట్టుకుని తన ఆలుగడ్డలు ఇప్పించాలని దబాయించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
అది దీపావళికి ముందు రోజు. పండుగ నాడు ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా చూసుకోవాలని పోలీసు శాఖ మొత్తం అప్రమత్తంగా ఉంది. అలాంటి సమయంలో యూపీ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ 112కి ఒక కాల్ వచ్చింది. తమ ఇంట్లో దొంగతనం జరిగిందని అవతలి వ్యక్తి చెప్పడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే కాల్ చేసిన విజయ్ వర్మ ఇంటికి వెళ్లారు.
హర్దోయ్ జిల్లా మన్నపుర్వాలోని విజయ్ వర్మ ఇంటికి వెళ్లిన పోలీసులు ఇంట్లో దొంగతనం ఎప్పుడు జరిగింది? ఏమేమీ ఏపోయాయని ప్రశ్నించారు. అప్పుడు తన ఇంట్లో పావు కిలో ఆలుగడ్డలు పోయాయని తాపీగా విజయ్ వర్మ చెప్పాడు. దీంతో కంగుతిన్న పోలీసులు ఏంటని ప్రశ్నించారు. ఏంటి తాగున్నావా? అని కూడా నిలదీశారు. దానికి అవునని చెప్పిన విజయ్ వర్మ.. ‘ రోజంతా కష్టపడ్డా.. సాయంత్రం పూట ఒక పెగ్గు వేసుకున్నా.. అయితే ఏంటి.. ఇక్కడ విషయం మందు గురించి కాదు.. ఆలుగడ్డల దొంగతనం గురించి’ అని ఉల్టా పోలీసులనే విజయ్ వర్మ దబాయించాడు. అసలే వంట చేసుకోవడానికి ఆలుగడ్డలను ఉడుకబెట్టి.. పొట్టు కూడా తీసి ఉంచానని.. వాటిని వెంటనే పట్టుకురావాలని దబాయించాడు. దీంతో నోరెళ్లబెట్టిన పోలీసులు తర్వాత తేరుకుని ఆ మందుబాబుకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయవద్దని హెచ్చరించారు. కాగా, తన ఇంట్లో దొంగతనం గురించి సదరు మందుబాబు ఫిర్యాదు చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంట్లో ఆలుగడ్డలు పోయాయి అంటూ పోలీసులకు ఫిర్యాదు
యూపీ – మా ఇంట్లో దొంగలు పడ్డారు అంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు.. వెంటనే పోలీసులు ఆ ఇంటికి వచ్చారు.
తీరా చూస్తే పావుకిలో ఆలుగడ్డలు పోయాయంటూ తప్పతాగిన ఓ వ్యక్తి తాపీగా చెప్పాడు.
పైగా అవి వంట కోసం తోలు వలిచి పెట్టుకున్నవి,… pic.twitter.com/GEUsyNrFic
— Telugu Scribe (@TeluguScribe) November 2, 2024