బుధవారం 03 జూన్ 2020
National - May 20, 2020 , 18:26:18

అజయ్‌కుమార్‌ లల్లూకు మధ్యంతర బెయిల్‌

అజయ్‌కుమార్‌ లల్లూకు మధ్యంతర బెయిల్‌

ఆగ్రా : ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌కుమార్‌ లల్లూకు  ఆగ్రా కోర్టు జులై 16వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. యూపీలో వలస కార్మికులను స్వస్థలాలకు పంపించేందుకు ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీ బస్సులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం బస్సులకు అనుమతించకపోవడంతో కాంగ్రెస్‌ నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌కుమార్‌ లల్లూను అరెస్ట్‌ చేశారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo