ఇంఫాల్: మణిపూర్లో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా మోరే జిల్లాలో 30 ఇండ్లు, దుకాణాలకు మిలిటెంట్లు నిప్పు పెట్టారు. దీంతో భద్రతా దళాలు, మిలిటెంట్ల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. మరోవైపు కాంగ్పోక్పి జిల్లాలో సిబ్బందిని రవాణా చేసేందుకు భద్రతా దళాలు వినియోగిస్తున్న వాహనాలను మిలిటెంట్లు మంగళవారం తగలబెట్టారు. దిమాపూర్ నుంచి వస్తున్న వీటిని సాపోర్మెనాలో మిలిటెంట్లు అడ్డుకొని ఇతర సామాజిక వర్గాల వారు ఉన్నారంటూ తనఖీ చేసిన మిలిటెంట్లు వాటికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.