న్యూఢిల్లీ, జనవరి 16: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్‌పై సైనిక దాడిని అమెరికా వాయిదావేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానని రష్యా ప్రతిపాదించినప్పటికీ ఇరాన్‌తో యుద్ధం అనివార్యంగా కనిపిస్తున్నది. ఇరాన్ ప్రతిదాడులను తట్టుకునేందుకు వీలుగా తాము సంసిద్ధమవ్వడానికి మరికొంత వ్యవధి ఇవ్వాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికాను అర్థించినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.
అన్ని ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉన్నట్లు అమెరికా గురువారం జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవవసర సమావేశంలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్ స్పష్టం చేశారు. ఇరాన్లో ప్రస్తుతం కొనసాగుతున్న హింసకు జవాబు ఇచ్చేందుకు తమ అధ్యక్షుడు ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. అయితే అమెరికా చేస్తున్న ఆరోపణలను అసత్యాలుగా ఇరాన్ ప్రతినిధులు సమావేశంలో అభివర్ణించారు. అసత్యాలు, తప్పుడు సమాచారం ఆధారంగా తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు.