న్యూఢిల్లీ: నిధుల కొరతతో సతమతమవుతున్న ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ 60కిపైగా కార్యాలయాలు, ఏజెన్సీల్లో ఉద్యోగులను తగ్గించాలని నిర్ణయించింది. జూన్ మధ్య నాటికి 20 శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని ఉత్తర్వులు జారీచేసింది.
ఐరాస బడ్జెట్ ప్రస్తుతం 3.72 బిలియన్ డాలర్లుగా ఉన్నది. దీనిని 15 నుంచి 20 శాతం తగ్గించాలని ప్రధాన కార్యదర్శి గుటెరస్ లక్ష్యంగా పెట్టుకున్నారు.