త్రిస్సూర్, నవంబర్ 12: ఇంటికి కరెంటు కావాలంటే సబ్‌స్టేషన్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకొని, మీటర్ తెచ్చుకొని కనెక్షన్ ఇచ్చుకోవాలి. దీనికి బదులు ఇంట్లోనే కరెంటు తయారుచేసుకొంటే..! ఈ ఆలోచనతోనే కేరళకు చెందిన ఐపీ పాల్ అద్భుత ఆవిష్కరణ చేశారు. ఇంటి అవసరాల కోసం గాలితో కరెంటును ఉత్పత్తి చేసే పంకను ఇంట్లోనే తయారు చేశారు. విశేషమేమిటంటే.. సాధారణంగా వీచే గాలితోనూ విద్యుత్తును ఉత్పత్తి చేసేలా దాన్ని రూపొందించారాయన. గాలి పంకకు ఓ రూపు తీసుకురావటానికి దాదాపు 13 ఏండ్ల పాటు కష్టపడ్డారు. స్వతహాగా ఎలక్ట్రీషియన్ అయిన పాల్‌కు కరెంటును తయారుచేసే గాలి పంకను తయారు చేయాలన్న కోరిక ఉండేది. కొన్నేండ్ల పాటు గల్ఫ్‌లో పనిచేసి, తిరిగొచ్చిన ఆయన.. తన కలను సాకారం చేసుకోవటానికి చాలా కష్టపడ్డారు. తక్కువ బరువు ఉండేలా పంక రెక్కలు తయారుచేసేందుకే చాలా సమయం తీసుకొన్నారు. రూ.లక్షలు ఖర్చు పెట్టుకొన్నారు. ఎన్నో ప్రయోగాలు విఫలమయ్యాయి. చివరికి తను అనుకొన్నట్టు ఇంటి ఆవరణలో గాలి పంకను ఏర్పాటు చేసి విద్యుత్తును పుట్టించారు. తమకూ ఇలాంటివి కావాలని బోలెడు ఆర్డర్లు వస్తున్నాయని చెప్తున్నారాయన.
గాలి పంక విశేషాలు