రాంచి: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) ప్రయాణించిన కారు రోడ్డుపై ఉన్న నీటి గుంతలో చిక్కుకున్నది. కొంత సేపటి వరకు ఆ వాహనం ముందుకు కదలలేదు. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ కారు నుంచి కిందకు దిగారు. ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది స్థానికుల సహాయంతో ఆ వాహనాన్ని గుంత నుంచి బయటకు తోశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జార్ఖండ్‌లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎన్నికల ప్రచారం కోసం జార్ఖండ్‌లోని బహర్గోరాకు కాన్వాయ్‌లో వెళ్లారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో వర్షపు నీటితో నిండిన గుంతలో ఆయన కారు చిక్కుకున్నది.
కాగా, డ్రైవర్ ఎంత ప్రయత్నించినా ఆ వాహనం గుంత నుంచి బయటకు రాలేదు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది గొడుగులు పట్టుకోగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ కారు నుంచి కిందకు దిగారు. ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది స్థానికుల సహాయంతో ఆ కారును గుంత నుంచి బయటకు తోశారు. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ వాహనంలో ప్రయాణం కొనసాగించారు. కాస్త ఆలస్యంగా బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే కేంద్ర మంత్రి చౌహాన్ ప్రయాణించిన కారు రోడ్డుపై గుంతలో చిక్కుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Jharkhand | Union Minister Shivraj Singh Chouhan’s car today got stuck in a muddy pothole amid rains today in Baharagora where he was for a public rally pic.twitter.com/ZYrZanee9K
— ANI (@ANI) September 23, 2024