Ram Mohan Naidu | న్యూఢిల్లీ : పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. దీని కంటే ముందు రామ్మోహన్ నాయుడు ఓం శ్రీరామ్ అని 21 సార్లు తెలుగులో రాశారు. అనంతరం పదవీ బాధ్యతలు స్వీకరించి, కీలకమైన దస్త్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమం ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్లో అత్యంత చిన్న వయస్సులో కీలక బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యువతపై ప్రధానికి ఉన్న నమ్మకమేంటో అర్థమవుతుందని పేర్కొన్నారు. వందరోజుల ప్రణాళిక తయారుచేసి, దాన్ని అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించారు. సాంకేతికత వినియోగంతో పౌరవిమానయానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు.
సామాన్య ప్రయాణికుల కోసం ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ (Ease of Flying) పై దృష్టి పెడతామని వివరించారు. సమర్ధ నాయకత్వం ఎలా ఉండాలనేది చంద్రబాబు నుంచి నేర్చుకున్నానని ఆయన అన్నారు. ఎయిర్‌పోర్టుల నిర్మాణం వేగవంతం చేస్తామని తెలిపారు. 2014లో బాధ్యతలు చేపట్టిన అశోక్‌గజపతిరాజు విమానయాన శాఖలో మంచి పునాదులు వేశారని కొనియాడారు. ఉడాన్ స్కీమ్ కూడా ఆయన హయాంలోనే వచ్చిందని వెల్లడించారు.
Ram Mohan Naidu took charge of Civil Aviation Ministry today. He wrote ‘Om Shree Ram’ on a page 21 times before taking charge as advised by mother. 🔥🔥
Another heartburn moment for Leftists 😂 pic.twitter.com/nHkhEmhtlp
— BALA (@erbmjha) June 13, 2024