గోదాముల నిల్వలపై రైతులకు రుణాలు
రిజిస్టర్డ్ గోడౌన్లలో రైతులు నిల్వ చేసుకున్న తమ ఉత్పత్తులపై రుణాలు పొందేందుకు వీలుగా డిజిటల్ ప్లాట్‌ఫాంను కేంద్ర ఆహారా, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ సోమవారం ప్రారంభించారు.
- డిజిటల్ ప్లాట్‌ఫాం ప్రారంభించిన కేంద్రం
న్యూఢిల్లీ, మార్చి 4: రిజిస్టర్డ్ గోడౌన్లలో రైతులు నిల్వ చేసుకున్న తమ ఉత్పత్తులపై రుణాలు పొందేందుకు వీలుగా డిజిటల్ ప్లాట్‌ఫాంను కేంద్ర ఆహారా, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ సోమవారం ప్రారంభించారు. అలాగే వేర్‌హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (డబ్ల్యుడీఆర్ఏ) త్వరలో వేర్‌హౌస్ యజమాని చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్‌ను ప్రస్తుతమున్న 3 శాతం నుంచి 1 శాతానికి తగ్గించనున్నట్టు మంత్రి ప్రకటించారు.
ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి గోయల్ ‘ ఈ-కిసాన్, ఉపాజ్ నిధి’ పేరుతో డిజిటల్ గేట్‌వే ని ప్రారంభించారు. ఇది డబ్ల్యుడీఆర్ఏ కింద నమోదైన గిడ్డంగుల్లో రైతులు నిల్వ చేసిన సరుకుపై బ్యాంకుల నుంచి రుణాలు పొందటానికి సులభమైన మార్గంగా రూపొందనున్నది. ప్రస్తుతం డబ్ల్యూడీఆర్ఏ కింద 5,500 కంటే ఎక్కువ గిడ్డంగులు నమోదై ఉన్నాయి. మొత్తం వ్యవసాయ గిడ్డంగుల సంఖ్య లక్ష వరకు ఉంటుందని అంచనా.
రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించటం ద్వారా భారతీయ వ్యవసాయాన్ని ఆధునీకరించాల్సిన అవసరమున్నదని మంత్రి నొక్కి చెప్పారు. ప్రస్తుతం ప్రారంభించిన గేట్‌వేతో రైతులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా 7 శాతం వడ్డీతో రుణాలు సులభంగా లభిస్తాయని మంత్రి వెల్లడించారు. రైతులు గోదాముల్లో నిల్వ ఉంచిన ఉత్పత్తులను సరైన సమయంలో అమ్ముకోవచ్చని, ఇకపై నష్టాల్లో పంటలను అమ్ముకోవాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

