న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ స్పష్టం చేశారు. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య కొన్ని ఆస్తుల విభజనలో సయోధ్య కుదరడం లేదు అని పేర్కొన్నారు. ఏకాభిప్రాయం మేరకే ఆస్తుల విభజన జరుగుతుంది అని చెప్పారు. కేంద్ర హోంశాఖ ఇప్పటికే 26 సమావేశాలను నిర్వహించింది అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.