Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి మధ్య నువ్వానేనా అనే రీతిలో పోరు కొనసాగుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి భారీ ఆధిక్యం కనబరుస్తున్నారు.
గడ్కరీ తన సమీప ప్రత్యర్ధిపై 45,306 ఓట్ల మెజారిటీతో గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. ఇక మహారాష్ట్రలో ఇండియా కూటమి 27 స్ధానాల్లో ఆధిక్యత కొనసాగిస్తుండగా ఎన్డీయే కూటమి 20 స్దానాల్లో మెజారిటీ కనబరుస్తోంది.
మహారాష్ట్రలో బీజేపీ 28 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా మిత్రపక్షాలు 19 స్ధానాల్లో పోటీ చేశాయి. ఇక విపక్ష ఇండియా కూటమిలో శివసేన యూబీటీ 21 స్ధానాల్లో, కాంగ్రెస్ 17 స్ధానాల్లో, ఎన్సీపీ (శరద్ పవార్) 10 స్దానాల్లో పోటీ చేశాయి.
Read More :
Odisha Assembly: బీజేడీకి బ్రేకేసిన బీజేపీ !