న్యూఢిల్లీ, మార్చి 10: 2025 చివరి నాటికి సముద్రయాన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరెణ్ రిజుజు వెల్లడించారు. పీటీఐ ఇంటర్వ్యూలో ఆయన ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. మనుషుల్ని సముద్రం లోపల 6 కిలోమీటర్ల లోతుకి తీసుకెళ్లే సమ్మెర్సిబుల్ మత్స్య ప్రాజెక్ట్ ట్రయల్స్ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమవుతాయని తెలిపారు.
‘కాంతి కూడా ప్రయాణించని చోటికి మన మత్స్య మిషన్ వెళ్లనుంది’ అని రిజుజు చెప్పారు. సముద్రయాన్ మిషన్ను 2021లో ప్రారంభించారు. హిందూ మహా సముద్రంలో 6 కిలోమీటర్ల లోతుకు ముగ్గురు శాస్త్రవేత్తలను పంపి పరిశోధనలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.