ఫరీదాబాద్: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోదరుడు, సీనియర్ బీజేపీ నేత, నగరోటా ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా(Devender Rana) ఇవాళ మృతిచెందారు. హర్యానాలోని ఫరీదాబాద్ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 59 ఏళ్లు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. డీఎస్ రాణా మృతి వార్త వ్యాపించగానే జమ్మూలోని గాంధీనగర్ ఏరియాలో ఉన్న ఆయన ఇంటి వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా హుటాహుటిన బయలుదేరి వెళ్లారు.
జమ్మూలోని డోగ్రా కమ్యూనిటీ తరపున దేవేందర్ సింగ్ గట్టి స్వరాన్ని వినిపించారు. రాజకీయాల నుంచి బడా వ్యాపారవేత్తగా ఆయన ఎదిగారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నగ్రోటా నియోజకవర్గం నుంచి దేవేందర్ సింగ్ రాణా ఎన్నికయ్యారు. రెండోసారి ఆయన ఆ సీటును సొంతం చేసుకున్నారు. సోదరుడి మరణం పూడ్చలేనిదని, వ్యక్తిగతంగా తనకు నష్టం జరిగినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా సంతాపం ప్రకటించారు.
The terrible news from late last night isn’t really sinking in. I know the last few years have been marked by our differences Devender but I prefer to focus on the fun times we shared together, the excellent work we did together & the memories. You have been taken from us all too… pic.twitter.com/QoANZOyS3B
— Omar Abdullah (@OmarAbdullah) November 1, 2024