E-Challan | మితిమీరిన వేగం (Overspeeding) కారణంగా కేంద్ర మంత్రి (Union Minister), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) కారుకు బీహార్ (Bihar) ట్రాఫిక్ పోలీసులు చలాన్ (E-Challan) విధించారు. రాష్ట్రంలోని ఓ టోల్ ప్లాజా వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ఈ-డిటెక్షన్ సిస్టమ్ ద్వారా (e-detection system) కేంద్ర మంత్రి పాశ్వాన్ కారు ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్నట్లు గుర్తించారు. దీంతో మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు కేంద్ర మంత్రికి భారీగా జరిమానా విధించారు.
ఆగస్టు 24 పాశ్వాన్ పాట్నా నుంచి హాజీపూర్వైపు కారులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో కేంద్ర మంత్రి కారు ఓవర్‌స్పీడ్‌తో వెళ్తున్నట్లు గుర్తించిన కెమెరా.. ఈ-డిటెక్షన్ సిస్టమ్ ద్వారా పాశ్వాన్ మొబైల్ ఫోన్‌కు చలాన్ జారీ చేసింది. దీంతో చిరాగ్ పాశ్వాన్ రూ.2వేలు ఫైన్ కింద కట్టాల్సి ఉంటుందని సమాచారం.
బీహార్‌లో రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు ఇటీవలే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ-డిటెక్షన్ సిస్టమ్ ద్వారా ఈ-చలాన్ జారీని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని సుమారు 13 టోల్ ప్లాజాల్లో ఈ-డిటెక్షన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. చెల్లుబాటు అయ్యే బీమా, ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికేట్లు లేని వాహనాలకు ఈ-డిటెక్షన్ సిస్టమ్ ద్వారా ఈ-చలాన్లు వారి మొబైల్ ఫోన్స్‌కు పంపుతున్నారు. ఈ వ్యవస్థ స్వయంగా వాహనాలను తనిఖీ చేసి, అవసరమైన పత్రాలు లేనప్పుడు ఆటోమేటిక్‌గా ఈ-చలాన్లు జారీ చేస్తుంది.
వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించకుండా, అలాగే రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని బీహార్ ట్రాఫిక్ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) సుధాంశు కుమార్ తెలిపారు. ఈ కొత్త విధానం ద్వారా వారం రోజుల్లోనే సుమారు పది కోట్ల ఈ-చలాన్లు (E-Challans) జారీ చేశారు. ఆగస్టు 7 నుంచి 15 వరకు వారం రోజుల్లో రూ.9.49 కోట్ల విలువైన 16,755 ఈ-చలాన్లను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 9,676 ఈ-చలాన్లు ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన వాహనాలకు చెందినవి కాగా, బీహార్‌లో రిజిస్టర్ అయిన వాహనాలకు 7,079 ఈ-చలాన్లు జారీ చేసినట్లు చెప్పారు.
Also Read..
Landslides | వైష్ణో దేవి యాత్ర రూట్లో విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి
Kangana Ranaut | నా సినిమాపై ‘ఎమర్జెన్సీ’ విధించారు.. సినిమా విడుదలలో జాప్యంపై కంగన
Helicopter | రష్యాలో మిస్సైన హెలికాప్టర్ కథ విషాదాంతం.. 22 మంది మృతదేహాలు స్వాధీనం