అహ్మదాబాద్: మోదీ 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినపుడు అల్లరి మూకలకు గట్టి గుణపాఠం చెప్పారని, అప్పటి నుంచి రాష్ట్రంలో అల్లర్లకు ఎవరూ సాహసించలేదని అమిత్ షా చెప్పారు. అహ్మదాబాద్ జిల్లాలోని సనంద్‌లో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో అమిత్ షా మాట్లాడుతూ, అయోధ్యలో శ్రీరాముడిని 550 సంవత్సరాల నుంచి ఓ గుడారంలో ఉంచారని, రామాలయాన్ని నిర్మించాలన్న ఆకాంక్షలను మోదీ నిజం చేశారని చెప్పారు.