Union Home Minister : విపక్షాలు ఏం చేసినా 2029లో మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తుందని, మోదీ ప్రధాని అవుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్న స్ధానాల కంటే బీజేపీకి ఈ ఎన్నికల్లో అధిక స్ధానాలు లభించాయనే విషయం వారికి తెలియదని ఎద్దేవా చేశారు.
అస్ధిరతను కోరుకుంటున్న ఈ నేతలు పదేపదే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని ప్రచారం చేస్తున్నారని, తమ ప్రభుత్వం అయిదేండ్ల పదవీ కాలం పూర్తిచేయడంతో పాటు రానున్న ఎన్నికల్లోనూ విజయం సాధించి తదుపరి ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరుతుందని పేర్కొన్నారు. చండీఘడ్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు.
24 గంటల మంచినీటి సరఫరా ప్రాజెక్టును కేంద్ర హోంమంత్రి ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. విపక్ష ఇండియా కూటమి మరోసారి విపక్షంలో కూర్చునేందుకు సిద్ధపడాలని చెప్పారు. విపక్ష పాత్ర పోషించడం ఎలా అనేది వారు నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు.విపక్షం ఏం చేసినా అధికారంలోకి రావడంజరిగేపని కాదని చెప్పారు.
Read More :
Bomb threat | బీహార్ సీఎం ఆఫీస్కు బాంబు బెదిరింపు.. కేసు నమోదు..!