న్యూఢిల్లీ: దగ్గు సిరప్‌ల ఓవర్ ద కౌంటర్ (ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా కౌంటర్లో) అమ్మకాలపై కఠిన నిబంధనలు విధించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు డ్రగ్స్ (సవరణ) రూల్స్, 2025 ముసాయిదాను ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసింది.
దీనిపై 30 రోజుల్లో తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలియజేయాలని, తర్వాత సవరించిన కొత్త నిబంధనలతో తుది గెజిట్‌ను విడుదల చేస్తామని ప్రకటించింది. కొన్ని నెలల క్రితం తమిళనాడుకు చెందిన శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన దగ్గు సిరప్‌ను తాగి మధ్యప్రదేశ్‌లో 26 మంది పిల్లలు కన్నుమూశారు.