భారత నౌకా దళం అమ్ముల పొదిలోకి శుక్రవారం రెండు సరి కొత్త అస్ర్తాలు చేరాయి. ఐఎన్ఎస్ తారాగిరిని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలో ప్రారంభించారు. ఇది ప్రాజెక్ట్ 17ఎ కింద రూపొందించిన అత్యాధునిక యుద్ధ నౌక.
అరిదమన్ అనే అణు సామర్థ్యం కలిగిన జలాంతర్గామిని కూడా రాజ్నాథ్ విశాఖలో లాంఛనంగా ప్రారంభించారు. ఇది అణు శక్తి కలిగిన ఖండాంతర క్షిపణులను మోసుకెళ్లగలదు.